ఉపాధ్యాయులు నల్ల రిబ్బర్లు ధరించిన నిరసన

ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు పరచాలంటూ ఎపీటీఎఫ్ శాఖ ఆధ్వర్యంలో గురువారం నల్లరిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. నూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ విజయోత్సవ సభలు జరుపుకుంటున్న ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను మరచి 16 నెలలు కాలం జరిగినా నేటికి అమలు చేయక పోవటం దారుణమని అన్నారు. పీపీఎన్ రద్దు పరచి, ఒపీఎన్ పెన్షన్ అమలు, పెండింగ్ డీఏలను అమలు పరచాలని, పీఆర్సీ కమిషన్ నియమించాలని, ఐఆర్ మధ్యతరగతి భృతి ఇప్పించాలని, అన్ని రకాల యాప్లు రద్దు చెయ్యాలని, పెండింగ్ బకాయిలను వెంటను విడుదల చెయ్యాలని నినదిస్తూ ఈనెల 11వ తేదినుండి 17వ తేది వరకు వివిధ రూపాల్గొ నిరసన తెలపనున్నట్లు ఎపీటీఎఫ్ నాయకులు తెలిపారు. మండలంలోని పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు నల్ల రిబ్బన్లు ధరించి నమస్యలు తీర్చాలని నినదించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *