ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా హర్షవర్థన్ రాజు నియమితులైనారు. ఎస్పీ ఎఆర్ దామోదర్ ను విజయనగరం జిల్లా ఎస్పీగా బదిలీ చేసారు. ఆయన స్థానంలో తిరుపతి ఎస్పీ గా పనిచేస్తున్న హర్షవర్థన్ రాజు నియమితులైనారు. 2024 డిశంబర్ 31న జిల్లా ఎస్పీగా ఎఆర్ దామోదర్ బాధ్యతలు స్వీకరించారు. 8 నెలల 12 రోజుల పాటు పనిచేసిన ఎస్సీ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నేరాల నియంత్రణపై దృష్టి సారించి సక్సెర్ సాధించారు. ప్రతి గ్రామంలో సీసీ కెమోరాల ఏర్పాటుతో నేరాలు తగ్గుముఖం పట్టారు. స్పందన కార్యక్రమం నిర్వహించి క్షేత్ర స్థాయిలో సామాన్యుల సమస్యలను పరిష్కరించటంలో పెద్దపీట వేసారు.

