గాలి కుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని జిల్లా కలెక్టర్ పి రాజా బాబు జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో శనివారం జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి డాక్టర్ బి రవి కలిసి గాలి కుంటు వ్యాధి నిరోధక టీకాల వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. జిల్లాలోని పశుపోషకులు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజా బాబు కోరారు. పశుసంవర్ధక శాఖాధికారి బి రవి మాట్లాడుతూ ఈనెల 15 నుండి అక్టోబర్ 15 వరకు టీకాల కార్యక్రమం జరుగుతుందని గెదేలకు వాటి దూడలు ఆవులు వాటి దూడలకు, ఎద్దులకు వ్యాక్సిన్ ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. నెల రోజుల పాటి 6, 02,250 వ్యాక్సిన్ లుఇవ్వటం జరుగుతుందని చెప్పారు. జిల్లా పశువైద్యులు, సిబ్బంది సమిష్టిగా కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని కోరారు. పశుపోషకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆర్ఏ డి డిఏ ఎడీ డాక్టర్ సురేంద్ర ప్రసాద్, టెక్నికల్ ఎడి డా పారా శ్రీనివాస రావు, డాక్టర్ ఎన్ భరత్ తదితరులు పాల్గొన్నారు.
