తహసీల్దార్ కార్యాలయ ఎంఆర్ ఐ(మండల రెవెన్యూ ఇన్పెక్టర్)గా మన్నే పల్లి సుధీర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేయుచున్న ఎం ఆర్ అనూషను చీమకుర్తి బదిలీ చేశారు. సంతనూతలపాడు తహసీల్దార్ కార్యాల యంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మన్నేపల్లి సుధీర్ కు ఎంఆర్ఐగా పదో న్నతి కల్పించి తాళ్లూరుకు బదిలీ చేయగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగాఎంఆర్ ఐ మాట్లాడుతూ రెవెన్యూ సంబంధమైన సమస్యలను జాప్యం లేకుండా త్వరితగతిన పరిష్కారం చేసి రైతులకు ఇబ్బందులు జరుగకుండా చర్యలు చేపడతానన్నారు.
