నల్ల బర్లీ సాగు చేస్తే చట్టపరమైన చర్యలు – దర్శి ఎడీఏ బాలాజీ నాయక్

ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్ల బర్లీ పొగాకు సాగు రబీ -25లో నిషేదించినట్లు వ్యవసాయశాఖ దర్శి ఎడీఏ కె బాలాజీ నాయక్ అన్నారు. మండలంలోని బొద్దికూర పాడు, వెలుగు వారి పాలెం గ్రామాలలో మంగళవారం వ్యవసాయాధికారి ప్రసాద రావు ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎడీఏ బాలాజీ నాయక్ మాట్లాడుతూ .. అంతర్జాతీయ మార్కేట్లో పొగాకు కు డిమాండ్ తగ్గుతున్నందున రైతులు గమనించి ప్రత్యామ్నాయ పంటల సాగుపై మొగ్గు చూపాలని కోరారు. రైతులకు నష్టం కలగకుండా 75 రోజుల నుండి 90 రోజులలో పంట చేతికి వచ్చే అలనంద, సోయా చిక్కుడు, ఉలవలు అందుబాటులో ఉన్నాయని, అవి పశువుల దాణాగా, నేలను ఆరోగ్యకరంగా ఆదాయాన్ని అందిస్తాయని తెలిపారు. విఆర్తో చిన్ని క్రిష్ణయ్య, ఉప నర్పంచి పులి ప్రసాద్ రెడ్డి, ఎంపీటీసీ బాల కోటయ్య, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *