తాళ్లూరు మండలంలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈనెల 19న మండల స్థాయిలో నిర్వహించనున్న స్కూల్ గెమ్స్ ఫెడరేషన్ (ఎస్. జి ఎఫ్)ను విజయవంతం చెయ్యాలని మండల విద్యాశాఖాధికారి జి సుబ్బయ్య, ఎంఈఓ – 2 సుధాకర్ రావులు కోరారు. స్థానిక ఎంఆర్నీ కార్యాలయంలో మంగళవారం ఆయా పాఠశాలల పీఈటీ లతో సమావేశం నిర్వహించారు. క్రీడలకు సంబంధించి విధి విధానాలు, నిర్వహణపై చర్చించారు. మండల విద్యాశాఖాధికారుల పర్యవేక్షణలో తూర్పుగంగవరం జెడ్పీ ఉ న్నత పాఠశాల హెచ్ఎం వైఎన్ ఆర్ కే ప్రసాద్ అధ్యక్షతన క్రీడలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మండల కోఆర్డినేటర్ గా ఎన్ రవి ప్రసాద్ రెడ్డి వ్యవహరిస్తారని తెలిపారు. ఈనెల 19న తూర్పుగంగవరం జిల్లా పరిషత్ ఉ న్నత పాఠశాలలో ఏడు అంశాలలో పోటీలు ప్రారంభం అవుతాయని చెప్పారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సంబంధిత షీట్ ను నింపి బుధవారం ఉదయం అందజెయ్యాలని కోరారు.
