ప్లోరోసిస్ పై అవగాహన కలిగి ఉండాలి – పలు గ్రామాలలో విద్యార్థులకు అవగాహన నదస్సు

ప్లోరో సిన్ పై అవగాహనతో నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తూర్పుగంగవరం పీహెచ్ సి వైద్యాధికారి డాక్టర్ మౌనిక, ఫ్లోరోసిన్ కోఆర్డినేటర్ డాక్టర్ అనిల్ అన్నారు. మండలంలోని తూర్పుగంగవరం జెడ్పీ, లక్కవరం జెడ్పీ హైస్కూల్స్, బెల్లంకొండ వారి పాలెం, దోసకాయల పాడు ప్రాధమిక హైస్కూల్స్ను నందర్శించి విద్యార్థులకు ప్లోరోసిస్ పై అవగాహన కల్పించి, వారి దంతాలకు పరీక్షలు నిర్వహించారు. సచివాలయాల పరిధిలో ప్రతి పాఠశాల పరధిలో ఇంటింటి సర్వే నిర్వహించాలని సిబ్బందికి నూచించారు. వారికి సహకరించాలని డాక్టర్ మౌనిక కోరారు. అవసరమైన వారికి పరికరాలు సైతం అందజేస్తామని గతంలో కూడ స్టిక్స్, వీల్ చైర్స్ అందజేసినట్లు చెప్పారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తూర్పుగంగవరంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ను పిహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మౌనిక పరిశీలించారు. పలు రికార్డులను పరిశీలించారు. డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, హెచ్ఐఓ చంద్ర శేఖర్ బాబు, హెచ్ఎన్ పి పాపి రెడ్డి, ఎన్టీ అంజి రెడ్డి, హెచ్ఎ గోపి నాయక్, పీహెచ్ఎన్ రమణమ్మ, రామన్ ఆయా కార్యక్రమాలలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *