జిల్లా కలెక్టర్ పి. రాజాబాబును బుధవారం ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావు, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత ప్రకాశం భవనములో మర్యాదపూర్వకముగా కలిశారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన అంశాలపై వారు కలెక్టర్ తో చర్చించారు. జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల నాయకులు కూడా కలెక్టర్ ను కలిసి నూతనంగా బాధ్యతలు చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలిపారు.



