కుటుంబంలో మహిళా ఆరోగ్యవంతంగా ఉంటె ఆ కుంటుంబం సమాజంలో బలంగా ఉంటుంది – జిల్లా పి. కలెక్టర్ రాజాబాబు -ఘనంగా ప్రారంభమైన స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం -ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఒంగోలు ఎంపీ మాగుంట ఎమ్మెల్యే దామచర్ల తదితరులు

కుటుంబంలో మహిళా ఆరోగ్యవంతంగా ఉంటె ఆ కుంటుంబం సమాజంలో బలంగా ఉంటుందన్న ఉద్దేశ్యంతో కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పేర్కొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

భారత ప్రధాని నరేంద్ర మోడీ తన 75వ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు మహిళలు మరియు పిల్లల ఆరోగ్యంపై దృష్టి సారించి నిర్వహించనున్న స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని బుధవారం ఒంగోలు జిజిహెచ్ లో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ రావు, నగర మేయర్ గంగాడ సుజాత లతో కలసి జ్యోతి ప్రజల్వన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. ఆరోగ్యకరమైన మహిళ – బలమైన కుటుంబం అనే స్లోగన్ తో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ తన 75వ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా అనీ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రారంభించుకోవడం ఎంతో సంతోషదాయకమన్నారు. ఎ రోజైతే స్త్రీ లు కూడా ఆరోగ్యంగా అభివృద్ధిలో భాగస్వాములు అవుతారో అప్పుడే సమాజంలో ఉహించనటువంటి అభివృద్ధి సాద్యమౌతుందన్న ఉద్దేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్య రంగానికి ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. మహిళలే సమాజానికి పునాదులని, వారి ఆరోగ్యం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయని తెలిపారు. ప్రతీ మహిళా తన ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉంటే అనారోగ్య సమస్యలు రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకుంటారని కలెక్టర్ పేర్కొన్నారు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా మహిళ తన ఆరోగ్య పరిస్థితిని త్వరగా చెప్పరని, వారి ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో వుంచుకొని ఈ కార్యక్రమం ద్వారా మహిళలు మరియు పిల్లల ఆరోగ్యంపై దృష్టి సారించడం జరిగిందన్నారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు అనీ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ఆరోగ్య పరీక్షలు, గైనకాలజికల్ పరీక్షలతో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు మరియు కంటి పరీక్షలు తదితర పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట వేసి రూ.25 లక్షల రూపాయల వరకు ఎన్టిఆర్ వైద్య సేవల ద్వారా వైద్య సేవలను అందించడం జరుగుచున్నదన్నారు. 70 నుండి 80 శాతం మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్నందున గ్రామీణ ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొనేలా వైద్య సిబ్బంది క్షేత్ర స్థాయిలో ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యాన్ని తెలియచేసి మహిళలు వైద్య పరీక్షలను సద్వినియోగం చేసుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్, వైద్యాదికారులకు సూచించారు. జిల్లా లో విద్యా, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఆసుపత్రులను, పాఠశాలలను తరచూ విజిట్ చేసి ఆయా రంగాల అభివృద్దికి తన వంతు కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు.

ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ.. కుటుంబంలో స్త్రీ శక్తివంతురాలు అయితే ఆ కుటుంబాన్ని బలంగా తీర్చిదిద్దడం తో పాటు సమాజంలో ఆ కుటుంబం బలంగా ఉండేలా కృషి చేయడం జరుగుతుందన్నారు. మహిళ ఆరోగ్య పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ తన 75వ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు అనీ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం ద్వారా వైద్య పరీక్షలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో బుధవారం లాంచనంగా ప్రారంభించడం జరిగిందన్నారు. నేడు ప్రవేటు ఆసుపత్రులకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవడం ఖర్చుతో కూడుకున్నదని, ఈ కార్యక్రమం ద్వారా చేపడుతున్న స్క్రీనింగ్ పరీక్షలను ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ, మహిళ ఆరోగ్యం బాగుంటే ఆ కుటుంబం బాగుంటుందన్న ఉద్దేశ్యంతో మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అనీ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం ద్వారా వైద్య పరీక్షలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం పై క్షేత్ర స్థాయిలో ప్రజలకు ముఖ్యంగా మహిళలకు అవగాహన కల్పించి ప్రతి మహిళా సద్వినియోగమ చేసుకునేలా వైద్య శాఖ అధికారులు, సిబ్బంది కృషి చేయాలన్నారు.

నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ…. స్త్రీ ఆరోగ్యంగా ఉంటూ విద్యావంతురాలైతే ఆ కుటుంబం ఆరోగ్యవంతంగా, అభివృద్ధి పదంలో ఉంటుందన్న ఉద్దేశ్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల విద్య, ఆరోగ్యం పట్ల అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుచున్నదన్నారు. మహిళ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

తొలుత జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వెంకటేశ్వర్లు స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ప్రతిజ్ఞ ను అందరిచే చేయించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా వెంకటేశ్వర్లు, స్టేట్ నోడల్ అధికారి శ్యామల, జీజీహెచ్ ఇంచార్జి సూపరింటెండెంట్ డా కిరణ్ కుమార్, ప్రిన్సిపాల్ అశోక్ కుమార్, డిసిహెచ్ఎస్ డా శ్రీనివాస నాయక్, ఐసిడిఎస్ పిడి శ్రీమతి సువర్ణ, జీజీహెచ్ వైద్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *