ఒంగోలు నగరంలోని సీతారాంపురం శర్మ కాలేజీ వద్దగల శ్రీ వేప అంకమ్మ తల్లి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం నుండి అక్టోబర్ రెండవ తేదీ గురువారం వరకు జరుగుతాయని వేప అంకమ్మ తల్లి దేవస్థానం ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు అనగా 29వ తేదీ సోమవారం సాయంత్రం భరతనాట్య ప్రదర్శన మరియు అమ్మవారి నగరోత్సవం శోభాయమానంగా భక్తితో జరుగునని తెలిపారు.
నవరాత్రులలో అమ్మవారు రోజుకొక అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తారని వివరించారు. 22వ తేదీ బాలా త్రిపుర సుందరి దేవిగా, 23వ తేదీ గాయత్రీ దేవిగా, 24వ తేదీ అన్నపూర్ణాదేవిగా, 25వ తేదీ కాత్యాయని దేవిగా, 26వ తేదీ మహాలక్ష్మి దేవిగా, 27వ తేదీ లలితా త్రిపుర సుందరీ దేవిగా, 28వ తేదీ చండికా పరమేశ్వరి దేవిగా, 29వ తేదీ సరస్వతీదేవిగా, 30వ తేదీ దుర్గాదేవిగా, ఒకటవ తేదీ మహిషాసుర మర్దినిగా, రెండవ తేదీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారని కనుక ఈ దసరా శరన్నవరాత్రుల్లో భక్తులందరూ విచ్చేసి వేప అంకమ్మ తల్లి వారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా తెలిపారు.

