పిల్లలు లేని దంపతులకు పిల్లల దత్తత ఒక వరమని జిల్లా కలెక్టర్ పి రాజా బాబు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు దత్తత కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాలను నవంబర్ నెలలో నిర్వహించేందుకు వీలుగా సోమవారం అందుకు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ రాజా బాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ దత్తత తీసుకోవాలని కోరారు. దళారులను నమ్మి మోస పోవద్దని చెప్పారు. దత్తత తీసుకునే వారు సమగ్ర బాలల పరిరక్షణ విభాగం,
మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖ కార్యాలయాలను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్ సువర్ణ, జిల్లా బాలల సంరక్షణ అధికారి పి దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
