నజ్జల నూర్పిడిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు
సూచించారు. మండలంలోని తురకపాలెం గ్రామంలో పలు పంటలను ఆయన సోమవారం పరిశీలించారు. కళ్లంలో ఆరబెట్టిన నజ్జ కంకులను పరిశీలించి పూర్తిగా తేమ శాతం తగ్గిన తర్వాత కళ్లం చేసి నిల్వ ఉంచు కోవాలని నూచించారు. ఎక్కవ కాలం నిల్వ ఉంచదలచినట్లయితే గోనే సంచులను వేప ఆకు నీళ్లలో కడిగి ఆరబెట్టిన తర్వాత అందులో నిల్వ చెయ్యాలని లేదంటే వేపాకు గింజలతో కలిపి నిల్వ ఉంచుకోవచ్చని పలు సూచనలు చేసారు. విఏఏ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

