సమాజమే దేవాలయం -ప్రజలే దేవుళ్లు అని నినదించిన టిటిపి వ్యవస్థాపక అధ్యక్షుడు,మాజీ సీఎం నందమూరు తారక రామారావు స్ఫూర్తితో పేద ప్రజలకు టిడిపి అండగా నిలిచిందని దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. తాళ్లూరులో పార్టీ 44వ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి నందమూరు తారక రామారావు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళు లు అర్పించారు. ప్రపంచంలో తెలుగు వారిని నంబర్ వన్ గా చేయటమే లక్ష్యంగా టిడిపి ముందుకు సాగుతుందని వివరించారు. కేక్ కట్ చేసి పంచిపట్టారు. పారిశుధ్య కార్మికులకు ఇడమకంటి నుబ్బా రెడ్డి, విజయ దంపతుల సౌజన్యంతో పార్టీ ఆవిర్భావ దినోత్సవరం సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చేతుల మీదుగా బట్టల పంపిణీ చేసారు. ఒకరి కొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో ఎఎంసీ చైర్మన్ డీ ఎన్ సుబ్బా రావు, పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, రాష్ట్ర నాటకరంగా అకాడమి డైరెక్టర్ బి ఓబులు రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఐవీ రమణా రెడ్డి, బడే, సొసైటీ అధ్యక్షులు గొంది రమణా రెడ్డి (సమర), వల్లభనేని నుబ్బయ్య, కరువది మేజర్ నీటి సంఘం ఉపాధ్యక్షుడు తూము శివ నాగి రెడ్డి, మానం రమేష్ బాబు, గొల్లపూడి వేణు బాబు, కైపు రామ కోటి రెడ్డి. క్లస్టర్ ఇన్చార్జిలు రాచకొండ వెంకట రావు, కైపు నాగార్జున రెడ్డి, నారి పెద్ది కళ్యాణ్, నవులూరు విద్యా సాగర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు మారం వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




