హైదరాబాద్ మార్చి 29 , (జే ఎస్ డి ఎం న్యూస్) : రోడ్డు భద్రతను మెరుగుపరచడంలో భాగంగా, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మార్చి 27 మరియు 28 తేదీల్లో (శుక్ర, శనివారాలు) నగరవ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunken Driving) పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ రెండు రోజుల తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ మొత్తం 239 మంది డ్రైవర్లు పట్టుబడ్డారు.
వాటిలోద్విచక్ర వాహనాలు క్యూ(Two-wheelers)190
త్రీ-వీలర్లు(Three-wheelers)18,ఫోర్-వీలర్లు మరియు ఇతర వాహనాలు: 31
బి.ఎ.సి (BAC) స్థాయిల వివరాలు:
మద్యం సేవించిన పరిమాణం (Blood Alcohol Content) ఆధారంగా నమోదైన కేసుల వివరాలు కింది విధంగా ఉన్నాయి:30-50 మధ్య: 55 కేసులు51-100 మధ్య: 101 కేసులు101-150 మధ్య: 42 కేసులు151-200 మధ్య: 29 కేసులు201-250 మధ్య: 07 కేసులు251-300 మధ్య: 03 కేసులు300 పైన: 02 కేసులు
మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాల పట్ల పోలీసులు ‘జీరో టాలరెన్స్’ (Zero Tolerance) విధానాన్ని అనుసరిస్తున్నారని, ఈ ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. రోడ్డు నిబంధనలను పాటించి, సురక్షితమైన ప్రయాణానికి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.
మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్ – 239 కేసులు నమోదు.
29
Mar