తాళ్లూరు మండలంలో శనివారం నిర్వహించిన బయాలజీకల్ సైన్స్ ( ఎన్. ఎస్ ) పరీక్షకు 9 మంది గైర్హాజరు అయినట్లు మండల విద్యాశాఖాధికారి జి నుబ్బయ్య, ఎంఈఓ -2 సుధాకర్ రావు లు తెలిపారు. బొద్దికూరపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 184 మంది గాను ఒకరు గైర్హాజరు, తూర్పుగంగవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో 249 మంది గారు ఇరువురు గైర్హాజరు, వికే ఉన్నత పాఠశాలలో 161 మంది గాను ఇరువురు గైర్హాజరు, సరస్వతి అన్ ఎయిడెడ్ పాఠశాలలో 121 మంది కి గాను నలుగురు గైర్హాజరు అయినట్లు చెప్పారు. గిరిధర శర్మ అధికారులు స్క్వాడ్ బృందం తాళ్లూరు, తూర్పుగంగవరం, బొద్దికూరపాడు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఆయా పరీక్షా కేంద్రాలకు డీఓలుగా చాంద్ బాష, యు వెంకటేశ్వర్లు, సుబ్బలక్ష్మమ్మ, మోహన్ గాంధీ, చీఫ్ లుగా శ్రీనివాస రావు, స్వామి దాను, శ్రీ రంగ నాయకులు, నవనీతమ్మ లు వ్యవహరించారు.
బయాలజికల్ సైన్స్ పరీక్షకు 9 మంది గైర్హాజరు
28
Mar