మంచి అలవాట్లు, బలమైన కాలేయాన్ని తయారు చేస్తాయి.18న అంతర్జాతీయ కాలేయ దినోత్సవం.డాక్టర్ కె.ఎన్. చందన్ కుమార్.

హైదరాబాద్ ఏప్రిల్ 18
(జే ఎస్ డి ఎం న్యూస్) :
మానవ శరీరంలో లివర్ (కాలేయం) అత్యంత కీలకమైన అవయవం.దీన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే మనిషి అంత ఆరోగ్యంగా ఉండగలడు. ఇటీవల కాలంలో మనం వయసుతో సంబంధం లేకుండా ఎక్కువగా లివర్ ఫెయిల్ అయినవారిని చూస్తున్నం. దీనికి ప్రధానం కారణం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లే. మన లివర్ ని మనం కాపాడుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది.
భారతదేశం ప్రస్తుతం ఎన్ఏఎఫ్ఎల్ డి (నాన్-అల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్) మరియు మెటబాలిక్ లివర్ వ్యాధుల కేంద్రంగా మారుతున్న నేపథ్యంలో, ఈ సంవత్సరపు థీమ్ “మంచి అలవాట్లు, బలమైన కాలేయం” మన ఆరోగ్యం రోజువారీ అలవాట్లపై ఆధారపడి ఉంటుందని గుర్తుచేస్తోంది.
నగరాల్లో నివసిస్తున్న భారతీయుల్లో దాదాపు ప్రతి ముగ్గురిలో ఒకరికి ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. కాబట్టి ఇప్పుడే చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది. పెద్ద మార్పులు అవసరం లేదు నిరంతరమైన మంచి అలవాట్లు అవసరం.
లివర్ దెబ్బతిన్నప్పుడు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి:
అలసట, బలహీనత, ఆకలి తగ్గడం, వాంతులు కళ్లలో, చర్మంలో పసుపు రంగు (జాండిస్), పొట్ట ఉబ్బరం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఇక గతంతో పోలిస్తే ఇప్పుడు లివర్ మార్పిడి కేసులు ఎక్కువగా అవుతున్నాయి. అలాగే ప్రజల్లో కూడా లివర్ మార్పిడిపై అవగాహన ఇప్పుడిప్పుడే వస్తోంది. శరీరంలో ఏ అవయవాలు దానం చేసిన తిరిగి రావు కానీ లివర్ ఒక్కటే తిరిగి సాధారణ స్థితికి వస్తుంది.ఆరోగ్యకరమైన కాలేయం కోసం నా 5 ముఖ్య సూత్రాలు సంపూర్ణ ఆహారం తీసుకోండి,ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం, తక్కువ కొవ్వు ప్రోటీన్లు తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారం, అధిక చక్కెరల వినియోగాన్ని తగ్గించాలి.ప్రతిరోజూ వ్యాయామం చేయండి:
రోజుకు కనీసం 30 నిమిషాలు శారీరక చురుకుదనం ఉంటే కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం నివారించవచ్చు.మద్యం నివారించండి లేదా పరిమితం చేయండి.మద్యం పూర్తిగా మానేయడం ఉత్తమం. లేకపోతే వారానికి 10 యూనిట్లకు మించకుండా పరిమితం చేయాలి.ముందుగానే పరీక్షలు చేయించుకోండి:
లివర్‌కు సంబంధించిన సమస్యలు చాలా సార్లు లక్షణాలు లేకుండా (“సైలెంట్”) ఉంటాయి. కాబట్టి రెగ్యులర్ హెల్త్ చెకప్‌లతో ముందుగానే గుర్తించాలి.పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించండి, కండరల బలం పెంచండి:
సెంట్రల్ ఒబేసిటీ తగ్గించడం, స్కెలెటల్ మసిల్ మాస్ పెంచడం లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇది లివర్ ఆరోగ్యానికే కాదు, మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్, గుండెజబ్బులు, స్ట్రోక్ మరియు క్యాన్సర్ ప్రమాదాలను కూడా తగ్గిస్తుంది.చిన్న మార్పులు, నిరంతరమైనమంచి అలవాట్లు — ఇవే బలమైన కాలేయానికి మూలం.
ఈరోజే ప్రారంభించండి… ఆరోగ్యమైన కాలేయంతో ఆరోగ్యమైన జీవితాన్ని సాగించాలన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *