రాంగోపాల్ పేట ఏప్రిల్ 18 ,(జే ఎస్ డి ఎం న్యూస్) :
రాంగోపాల్ పేట డివిజన్ అంబేద్కర్ నగర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద ఆదివారం తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నారు. టీజీఎస్పీఎఫ్ డి జి స్వాతిలక్రా నేతృత్వంలో కమాండెంట్ ఎం త్రినాథ్, అసిస్టెంట్ కమాండెంట్ సన్యాసిరావుల ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నారు. కాలనీ ప్రెసిడెంట్ గణేష్ ఆధ్వర్యంలో బస్తీ వాసులు ఈ ఉచిత వైద్య శిబిరాన్నివినియోగించుకోవాలని అన్నారు.ఉదయం గం 8ల నుంచి క్యాంపు
ప్రారంభమవుతున్నారు.శ్రీ నేత్రాలయ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు,సౌజన్య డెంటల్ ఆధ్వర్యంలో పంటి పరీక్షలు, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ముక్కు,చెవి,పరీక్షలు నిర్వహిస్తున్నారు.వీటితో పాటు సాధారణ పరీక్షలు, ఈ సి జీ, టూ డీ ఎకో ,బి.పి.షుగర్,తదితర పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని డబుల్ బెడ్ రూమ్ వాసులతో పాటు సమీప బస్తీ లలో నివసించే పేదలు ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని టి జి ఎస్ పి ఎఫ్ పోలీస్ లు తెలియ జేశారు.
నేడు అంబేద్కర్ నగర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద టి జి ఎస్పి ఎఫ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్.
18
Apr