సమన్వయంతో పనిచేస్తే స్థానిక సమస్యలు మటు మాయం – ఎంపీపీ తాటికొండ -ఘనంగా పంచాయితీ రాజ్ దినోత్సవం

ప్రభుత్వం ఇస్తున్న ప్రొత్సహంతో పాటు స్థానిక నాయకుల సమన్వయంతో అధికారులు ముందుకు సాగితే స్థానికంగా సమస్యలు మటు మాయం అవుతాయని ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జాతీయ పంచాయితీ రాజ్ దివాస్ ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ అజాత అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. టిడిపి పార్టీ అధ్యక్షుడు ఎం వెంకటేశ్వర రెడ్డి, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఐ వెంకటేశ్వర రెడ్డి, కరువది మేజర్ ఉపాధ్యక్షుడు శివ నాగి రెడ్డి, సోసైటీ చైర్మన్ వల్లభనేని సుబ్బయ్య, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ బి ఓబులు రెడ్డి , ఏఎంసీ డైరెక్టర్ సైదావలి లు ముఖ్య అతిథులుగా పాల్గొని మహాత్మాగాంధీ జీ I డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ల చిత్ర పటాలను నివాళులు అర్పించారు. అనంతరం పంచాయితీ అభివృద్ధికి ప్రభుత్వం చిత్త శుద్ధితో కృషి చేస్తుందని గత ప్రభుత్వం పంచాయితీలను, సర్పంచిలను గాలికి వదిలివేసిందని అన్నారు. అధికారులు సమన్వయంతో స్థానిక సమస్యలు పరిష్కరించాల్సిన ఆవశ్యకతను వివరించారు. నిజాయితీతో పనిచేస్తే మరింత మేలు చేయవచ్చని అన్నారు. పంచాయితీ రాజ్ ప్రాముఖ్యతను వక్తలు వివరించారు. ఇంటి పన్నుల వసూళ్లలో, చిత్త సేకరణలో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందిని ఘనంగా సన్మానించారు. డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాస రావు, ఎంఈఓ జి సుబ్బయ్య, వ్యవసాయాధికారి ప్రసాద రావు తదితరులు పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
నివాళులర్పిస్తున్న అధికారులు , ప్రజా ప్రతినిధులు

మాట్లాడుతున్న ఎంపీపీ తాటికొండ

మాట్లాడుతున్న జడ్పిటిసి మారం
మాట్లాడుతున్న వైస్ ఎంపీపీ ఐడమ కంటి
మాట్లాడుతున్న మండల పార్టీ అధ్యక్షుడు మేడగం
మాట్లాడుతున్న సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని
మాట్లాడుతున్న కరువది మేజర్ ఉపాధ్యక్షుడు
శివ నాగిరెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *