10 వ తరగతి -2026లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులలో ఉత్తమ మార్కులు సాధించి తాళ్లూరు మండలంలో ప్రతిభ చాటిన లక్కవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన బండారు కార్తీక్ (573) ను జిల్లా కలెక్టర్ రాజా బాబు సన్మానించి క్యాష్ అవార్డును అందించారు. ఒంగోలులో స్పందన నమావేశపు మందిరంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, ఎస్సీ, బీసీ, సంక్షేమ వసతి గృహాలలో ప్రతిభ చాటిన విద్యార్థులను సన్మానించారు. వారికి ఒక్కోక్కరికి జిల్లా కలెక్టర్ తన స్వంత నగదు రెండు వేల చొప్పున ప్రైజ్ మనీ అందించారు. జిల్లా విద్యాశాఖ అడిషినల్ డైరెక్టర్ సుబ్బా రెడ్డి, డీఈఓ రేణుక, పరీక్షల విభాగం అదనపు కార్యదర్శి శ్రీనివాస రావు, ఎస్సీ సంక్షేమాకారి లక్ష్మా నాయక్, బీసీ సంక్షేమాధికారి నిర్మల జ్యోతి, ఎంఈఓలు జి సుబ్బయ్య, ఎంఈఓ – 2 సుధాకర్ రావు, పాఠశాల హెచ్ఎం అనంత పద్మనాభ రావు తదితరులు పాల్గొన్నారు.

