వేసవి చలివేంద్రాలు బాటసారిల దప్పిక తీరుస్తాయి …సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని

బేగంపేట మే 2 (జే ఎస్ డి ఎం న్యూస్) :
వేసవి కాలంలో ఏర్పాటు చేసే చలివేంద్రాలు బాటచారులతో పాటు అనేకమంది దప్పికను తీరుస్తుందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం ఆయన రాంగోపాల్ పేట డివిజన్ లోని రాణిగంజ్ లో బి ఎం ఎస్ కార్మిక సంఘం ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించి మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాణిగంజ్ మార్కెట్ ప్రాతినిత్యం వివిధ ప్రాంతాల నుండి అనేకమంది దప్పికను తీర్చేలా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకులను అభినందించారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడటమే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం పట్ల ప్రశంసించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, అత్తిలి అరుణ గౌడ్, డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, బి ఎం ఎస్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కుమార్, మహేష్ గౌడ్, జహంగీర్, మల్లేష్ గౌడ్, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కిషోర్, ఆంజనేయులు, గణేష్, కొండాపురం మహేష్ యాదవ్, కుమార్ యాదవ్, ప్రేమ్, కొత్తూరు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *