రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నూతనంగా నియమించిన ఒంగోలు-నెల్లూరు పార్లమెంట్ ల జోనల్ కో-ఆర్డినేటర్ మద్దిపాటి వెంకటరాజు (గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే ) శనివారం ఒంగోలు నగరం, రామ్ నగర్ 2వ లైన్ లోని ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి మొదటిసారిగా విచ్చేసిన సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు మరియు కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ముక్కు ఉగ్రనరసింహరెడ్డి, పార్లమెంట్ కమిటీ సభ్యులతో కలిసి ఘన స్వాగతం పలికారు.ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు మరియు కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ముక్కు ఉగ్రనరసింహరెడ్డి, ప్రధాన కార్యదర్శి కొఠారి నాగేశ్వరరావు పూల బొకేతో మరియు శాలువాతో జోనల్ కో ఆర్డినేటర్ మద్దిపాటి వెంకట రాజు ని ఘనంగా సత్కరించటం జరిగింది. కమిటీ సభ్యులు అందరూ జోనల్ కో ఆర్డినేటర్ మద్దిపాటి వెంకట రాజు కి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం జోనల్ కో ఆర్డినేటర్ మద్దిపాటి వెంకటరాజ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు డా.ముక్కు ఉగ్రనరసింహరెడ్డి అధ్యక్షతన పార్లమెంట్ కమిటీ సభ్యులతో కలిసి జిల్లా రాజకీయ అంశాల గురించి, పార్టీ కోసం కష్టపడిన పార్టీ నాయకులు కార్యకర్తల గురించి మాట్లాడటం జరిగింది. కమిటీ సభ్యులు అందరూ ఉగ్ర నరసింహారెడ్డి నాయకత్వంలో బాగా పని చేసి ఒంగోలు పార్లమెంట్ ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి కొఠారి నాగేశ్వరరావు, పార్లమెంట్ అధికార ప్రతినిధులు దాసరి వెంకటేశ్వర్లు, బీరం అరుణా రెడ్డి, కార్యనిర్వాహ కార్యదర్శి గార్లపాటి శ్రీనివాసరావు, కార్యదర్శులు కసుకుర్తి అంకరాజు, తంజావూరి శ్రీనివాసమూర్తి, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
