హైదరాబాద్ మే 20,(జే ఎస్ డి ఎం న్యూస్) :
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో, అలాగే గత ఏడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఐపీఎల్‌లో తొలి ట్రోఫీ గెలుచుకున్న ఆనందాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద కోహ్లీ అభిమానులు ప్రత్యేక సేవా కార్యక్రమంనిర్వహించారు.దాదాపు రెండేళ్ల తర్వాత విరాట్ కోహ్లీ హైదరాబాద్‌కు రానున్న సందర్భంగా అభిమానులు ఉత్సాహంగా స్పందించారు. ఈ సందర్భంగా నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద అభిమానులు అన్నదాన కార్యక్రమం చేపట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కోహ్లీకి మద్దతుగా నినాదాలు చేశారు.
