బేగంపేట ,మే 20,(జే ఎస్ డి ఎం న్యూస్) :
దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం ఐ డి హెచ్ కాలనీలోని పార్థివాడ అడవి మైసమ్మ ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలలో ఆయన పాల్గొన్నారు. భక్తి భావాన్ని పెంపొందించే ఆలయాలను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. ఆలయ అభివృద్ధి కి సహకరించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. ఎమ్మెల్యే వెంట పద్మారావు నగర్ బి ఆర్ ఎస్ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, బన్సీలాల్ డివిజన్ అధ్యక్షుడు వెంకటేశ్ రాజు, నాయకులు ఏసూరి మహేష్, లక్ష్మీపతి, కొత్తూరు వెంకట్, కుమార్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, ప్రేమ్, గజ్జెల శ్రీనివాస్, అబ్బాస్, ఎర్ర విజయ్ శంకర్, కామరాజ్, అమ్మురాజ్, నాగలక్ష్మి తదితరులు ఉన్నారు.

