గోనే వారి పల్లె గ్రామానికి రాక పోకలు బంద్ అధికారుల అనాలోచిత నిర్ణయాలు ప్రజలకు శాపం –

అధికారుల అనాలోచిత నిర్ణయాలు ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయి. శివరామపురంలో పంచాయితీ రహదారిలో నిలుస్తున్న మురుగు నీరును తొలగించేందుకు ఏర్పాటు చేసిన కాలువ గోనే వారి పల్లి వాసులకు శాపంగా మారింది. ఆ నీరును పంపెందుకు అధికారులు శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. కారణం ఆ నీరు పంపే ప్రదేశం అధికార పార్టీకి చెందిన మద్దతు దారులకు కావటంతో అధికారులు ఏమి చెయ్యలేక సత మతం అవుతున్నారు. చివరికి రోడ్డు అయితే ఏవరు ఏమి అనరు అని అనుకున్నారో ఏమే పాపం అధికారులు ఆ వైపుగా గుంత తీసారు. దీంతో ఆ గుంత కాస్త దారికి పూర్తిగా అడ్డుగా ఉండటంతో ఆర్టీసీ, ప్రవేట్ స్కూల్ బస్సులు సైతం తిరగలేని పరిస్థితి. ఇప్పటికే ఆరోడ్డుకు అనుకుని ఒక విద్యుత్ స్తంభం ఉండటంతో అతికష్టం మీద ఆర్టీసీ, ఇతర బస్సులు రాక పోకలు సాగిస్తున్నాయి. అదీ కాస్త గుంత రూపంలో రోడ్డు పూడి పోవటంతో ఇక గురువారం ఆర్టీసీ సర్వీసులు ఆపివేసింది. దీంతో గ్రామస్తులు ఆరా తీయగా రోడ్డు గుంత తీసినట్లు తెలియటంతో గ్రామస్తులు అవాక్కయ్యాయి. వెంటనే గ్రామస్తులు తాళ్లూరు డిప్యూటీ తహసీల్దార్ గోపాలుని ఫణీంధ్రను కలిసి తమ రోడ్డులో తీసిన గుంటను పూడ్చాలని విన్నవించారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిన చందగా అధికారుల తీరు ఉందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతను పూడ్చి రాక పోకలు కొనసాగించేలా కృషి చెయ్యాలని ప్రజలు కోరుతున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *