ప్రకాశం జిల్లా పౌర సంబంధాల అధికారి(డిపిఆర్ఓ)గా ఎస్ రవికుమార్ నియమితులయ్యారు. సోమవారం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబును ఆయన ప్రకాశం భవనంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నెల్లూరులో డివిజనల్ పీఆర్వోగా బాధ్యతలు నిర్వహిస్తున్న రవికుమార్, ప్రమోషన్ పొంది డిపిఆర్ఓగా ప్రకాశం జిల్లాకు బదిలీ అయ్యారు. జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను మీడియా ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కలెక్టర్ ఆయనకు సూచించారు. జిల్లా యంత్రాంగానికి, మీడియాకు మధ్య వారధిగా సమర్థంగా పనిచేస్తానని రవికుమార్ తెలిపారు. నూతన డిపిఆర్వోగా బాధ్యతలు స్వీకరించిన రవికుమార్ కు సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు.
