వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూధన రెడ్డి బుధవారం తాడేపల్లిలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసారు. వైసీపి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మల ఆధ్వర్యంలో జిల్లాలో పార్టీ పటిష్టంగా పనిచేస్తుందని, ఐక్యతతో స్థానికంగా ముందుకు సాగుకూ, రైతుల సమస్యలతో పాటు ఎప్పటికప్పుడు పార్టీ పిలుపు మేరకు కార్యక్రమాలను విజయవంతం చేస్తున్న తీరును వివరించారు.
