బేగంపేట జులై 31(జే ఎస్ డి ఎం న్యూస్)
పండుగలు ఐక్యతకు చిహ్నంగా నిలుస్తాయని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం రాంగోపాల్ పేట డివిజన్ ఓల్డ్ గ్యాస్ మండి లో ఆషాడ బోనాల సందర్భంగా ఉప్పలమ్మ అమ్మవారి ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం నిర్వాహకులు ఆయనను సన్మానించి ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఫలహారం బండి ఊరేగింపు ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆషాడ బోనాలు ప్రారంభమయ్యాయంటే బస్తీ, కాలనీ అనే తేడా లేకుండా నగరం మొత్తం సందడి నెలకొంటుందని పేర్కొన్నారు. ఆలయాలకు వచ్చి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. అదేవిధంగా అంతా కలిసి పోతు రాజుల నృత్యాలు, డప్పు చప్పుళ్ళ తో ఫలహారం బండ్ల ఊరేగింపు ఎంతో కోలాహలంగా ఉంటుందని అన్నారు. అమ్మవారి చల్లని దీవెనలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, నాయకులు కిషోర్, ఆంజనేయులు, కోటేశ్వర్ గౌడ్, కొండాపురం మహేష్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, కమల్ కుమార్, కాలనీ వాసులు వినయ్, సుశీల్, శేషు, సాయిరాం, వినోద్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.


