లో ఓల్టేజి సమస్య పరిష్కారానికే విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం- విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ – రూ. 27.66 కోట్ల వ్యయంతో నిర్మించిన 132/33 విద్యుత్ నబ్ స్టేషన్ ప్రారంభం

పరిశ్రమలు, వ్యవసాయం అన్ని రంగాలలో ముందుకు సాగాలంటే విద్యుత్ ఎంతో ముఖ్యమైనదని అందులో నాణ్యమైన లో ఓల్టేజి నమన్య లేకుండా విద్యుత్ ను అందిచటమే లక్ష్యంగా విద్యుత్ సబ్ స్టేషన్ ల నిర్మాణం వేగవంతం చేసినట్లు విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కోన్నారు. తాళ్లూరు మండలంలోని శివరామపురం రెవిన్యూ పరధిలో రూ.27.66 కోట్ల వ్యయంతో నిర్మించిన తూర్పుగంగవరం 132/33 విద్యుత్ సబ్ స్టేషను ను సోమవారం ప్రారంబోత్సవం నిర్వహించారు. అనంతరం టిడిపి దర్శి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ అధ్యక్షతన సభను నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న విద్యుత్శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ ………2014-19 గత టిడిపి ప్రభుత్వ హయాంతో మంజూరు అయిన విద్యుత్ నబ్ స్టేషన్ న్ను గత ప్రభుత్వం అటకెక్కించిందని, రాష్ట్రం మొత్తం మీద ఇటువంటి విద్యుత్ సబ్ స్టేషన్లు 50 పైగా ఉన్నాయని వాటిని పూర్తి చేసేందుకు తక్షణ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఎల్నిలో ఎఫెక్ట్ ఉన్నా సరే విద్యుత్ కనెక్షన్లు అధికంగా ఉండటంతో పచ్చదనంగా ఉందని అన్నారు. నియోజక వర్గంలో ఎన్ని విద్యుత్ సబ్స్టేషన్లు కావాలంటే అన్ని సబ్ స్టేషన్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఆర్ డీ ఎస్ క్రింద రూ.90 కోట్లు ఇచ్చి ఉన్నామని రూ.80 కోట్ల వరకు ఖర్చుపెట్టామని అన్నారు. దర్శి నియోజక వర్గంలో విద్యుత్ శాఖ ద్వారా నూర్య ఘర్ తో పాటు పలు పధకాలలో రూ.150 కోట్లు ఖర్చు పెట్టామని అన్నారు. గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో నియోజక వర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటున్నామని అన్నారు. అయితే గత ఎన్నికలలో ఇక్కడ పార్టీ దెబ్బతిన్నదని, రాబోవు స్థానిక ఎన్నికలలో బలోపేతం కావటానికి అవనమైన అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు. గత ఐదేళ్లలో ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని చేసిన పాపాన పోలేదు. మీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి Request చేస్తేనే దర్శి నియోజక వర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలుపుకున్నామని, అద్దంకి డివిజన్లో కొనసాగించామని వివరించారు. రామానాయుడుతో మాట్లాడి మొగలిగుండాల రిజర్వాయర్ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకుండానే గత ప్రభుత్వంలో పూర్తి అయినట్లు ప్రారంభ శిలా ఫలకం వేయించుకున్నారని ఎద్దెవా చేసారు. సీఎం చంద్రబాబు నాయుడు నేడు రూ. 750 కోట్లు ఖర్చుపెట్టి పూర్తి చేస్తున్నారని అన్నారు. 1996లో నాడు చందబ్రాబు వెలుగొండ శంకుస్థాపన చేసారని, నా ఈనెల 31న చంద్రబాబు ప్రారంభిస్తున్నారని అన్నారు. గత చరిత్రను వివరించారు. అదే విధంగా చెప్పిన విధంగానే మార్కాపురం జిల్లా ఇచ్చామని, అద్దంకి, కందుకూరు నియోజక వర్గాలను ప్రకాశం జిల్లాలో కలుపుకున్నామని వివరించారు. నూతన పెన్షన్లు కూడ కొంత నగదు సౌలభ్యం రాగానే నూతన పెన్షన్లు ఇస్తామని అన్నారు. గత ప్రభుత్వంలో 9 సార్లు కరెంట్ చార్జీలు పెంచారని, విద్యుత్ 13 పైనలు ట్రూ అప్ చార్జీలు ఈ ప్రభుత్వంలో తగ్గించామని అన్నారు. చంద్రబాబు, పవన్, పీఎం మోదీ ఆధ్వర్యంలో చెప్పిన హామీలు చెప్పినట్లు చేస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలలో ఇచ్చిన మాట హామీ చేస్తూ పునర్మిర్మాణం చేస్తున్నామని అన్నారు. ఓక వైపు అభివృద్ధి, మరో వైపు విద్యుత్ చార్జీలు ఒక్క పైసా ఈ ఐదు సంవత్సరాలలో పెంచకకూడదని ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. నబస్టేషన్ నిర్మాణాలు, విద్యుత్ లైన్స్, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు అన్ని చేస్తామని భరోసా ఇచ్చారు. ఐతే అన్ని రకాలుగా ముందుకు దూసుకుపోవటానికి ముఖ్యంగా దర్శి నియోజక వర్గంలో స్థానిక ఎన్నికలలో మున్సిపాలిటీలు, ఎంపీపీలు, నర్పంచిలు, ఎంపీటీసీలు అన్ని గెలుచుకోవాలని, పార్టీ అభివృద్ధి రిజల్ట్ కనిపించాలని అన్నారు. అగ్రికల్చర్ కనెక్షన్లు అన్ని కూడ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.దర్శి టిడిపి ఇన్చార్ట్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ లు మాట్లాడుతూ రెండేళ్ల కూటమి పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖామంత్రి నారా లోకేషన్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నహకాంతో దర్శి అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నానని అన్నారు. శాశ్వితంగా లో ఓల్టేజి సమస్య పరిష్కారానికి తాళ్లూరుతో పాటు కురిచేడు, ముండ్లమూరు, దర్శి లలో నబ్ స్టేషన్లను పూర్తి చేసుకున్నామని అన్నారు. జిల్లా కలెక్టర్ సహకారంతో దొనకొండ అభివృద్ది చేస్తున్నామని అన్నారు. ఇలా అభివృద్దే అజెండాగా ముందుకు సాగుతున్నామని దర్శిలో కూటమి ప్రభుత్వంలో చేసిన, చేస్తున్న అభివృద్ధిని వివరించారు. మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపా రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అనేక అభివృద్ధి పనులు చేసామని, చేసిన పనిని చెప్పుకుని స్థానిక సంస్థలలో నత్తా చాటాలని కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అభివృద్ధి అనవాళ్లు లేకుండా పోయాయని, నబ్ స్టేషన్ సామాన్లు సైతం గత వైసీపీ నాయకులు ఎత్తుకేళ్లారని గుర్తు చేసారు. ముందుగా విద్యుత నబ్ స్టేషన్ శిలాఫలకాన్ని, ఆపరేషన్ రూమ్ ను ప్రారంభించారు. అతిధులకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎపీసీపీడీసీఎల్ డైరెక్టర్ మురళీ క్రిష్ణ యాదవ్, విద్యుత్ ఎన్ కట్టా వెంకటేశ్వర్లు, ఈఈ పాల గిరి శ్రీనివాస రావు, డీఈ వెంకటేశ్వర్లు, టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, జెడ్బీటీసీ మారం వెంకట రెడ్డి, రాష్ట్ర నాటక అకాడమి డైరెక్టర్ బి ఓబులు రెడ్డి, మానం రమేష్ బాబు, సూరిబాబు (పెద్దన్న), బీసీ కార్యదర్శి పిన్నక రమేష్, రాచకొండ వెంకట రావు, దర్శి మున్సిపాలిటి మాజీ చైర్మన్ నారపుశెట్టి పాపా రావు, ఎఎంసీ చైర్మన్ డీఎన్ సుబ్బా రావు, టిడిపి మండలాల అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, మోడీ ఆంజనేయులు, నెమిలయ్య, కూరపాటి శ్రీనివాస రావు, జిల్లా ఉపాధ్యక్షుడు కాట్రాజు నాగ రాజు, సొసైటీ చైర్మన్ వల్లభనేని సుబ్బయ్య, కరువది మేజర్ ఉపాధ్యక్షడు టీవీ శివ నాగి రెడ్డి, విద్యా సాగర్, కైపు కోటి రెడ్డి, కైపు నాగార్జున రెడ్డి. వేణు బాబు, సీహెచ్ వీర నాగి రెడ్డి, కళ్యాణ్ చక్రవర్తి, వెలుగు సుబ్బా రావు, వంగపల్లి నాగేశ్వర రావు, పేద కాలేషా వలి(బడే), ఎం తిరపతి స్వామి, హనుమంత రావు, గాడిపర్తి లక్ష్మి నారాయణ బీజేపి, జన సేన నాయకులు పాల్గొన్నారు.

గుంటి గంగా భవాని ఆలయంలో మంత్రి గొట్టిపాటి ప్రత్యేక పూజలు

జిల్లా లో ప్రసిద్ధి చెందిన గుంటి గంగా భవాని ఆలయంలో విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రితో పాటు టిడిపి దర్శి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావులకు ఆలయ ఈఓ నర్రా నారాయణ రెడ్డి, చైర్మన్ సానే సురేష్, సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అష్టోత్తర నామార్చన నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసి చైర్మన్ నారపు శెట్టి పిచ్చయ్య, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, మండల టిడిపి పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, ఎఎంసీ చైర్మన్ డీఎన్ సుబ్బా రావు, నాటక అకాడమి డైరెక్టర్ ఓబులు రెడ్డి, మానం రమేష్ బాబు, బీసీ సంఘ ప్రధాన కార్యదర్శి పిన్నిక రమేష్ , పేద కాలేషా వలి, రాచకొండ వెంకట రావు, సీహెచ్ వీర నాగి రెడ్డి, సాగర్, కళ్యాణ్ చక్రవర్తి, సొసైటీ చైర్మన్ వల్లభనేని సుబ్బయ్య, డాని, వలి, కైపు రామకోటి రెడ్డి, నాగార్జున రెడ్డి, రాచకొండ వెంకట రావు, సుబ్బా రావు, వేణుబాబు, తిరుపతి స్వామి తదితరులు పాల్గొన్నారు. పూజారులు ప్రకాశ రావు, కామేశ్వర శర్మ, బాల రాజు, విజయలక్ష్మిల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వైసీపీని వీడి టిడిపి చేసిన తూర్పుగంగవరం మైనార్టీ లు

తూర్పుగంగవరం గ్రామానికి చెందిన మైనార్టీ ముస్లీం నాయకులు పలు కుటుంబాలు సోమవారం వైసీపి ని వీడి టిటిపి లో చేసారు. రాష్ట్ర మంత్రి గొట్టి పాటి రవి కుమార్, టిడిపి దర్శి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ఆ ల ధ్వర్యంలో సోమవారం వైసీపీ పార్టీ ముస్లీం మండల పార్టీ అధ్యక్షుడు లతీఫ్ (బచ్చా), పలు గ్రామ అనుబంధ కమిటీ సభ్యులు ఫజల్, మదార్ వలి, అబ్దుల్ ఖాదర్ జిలాని, నందాని, కన్జూర్ వలి, సైదా, అన్వర్, చిన్న లతీఫ్, హుస్సేన్ బాష, షరీఫ్, అబ్దుల్ నలాం, కలీషా, అబ్దుల్ కలాం, ఖాశిం బాష, పెద్ద కాలేషా, కలిషా (ఖాసియా), కరిముల్లా, సైదా, బుడేషా, మస్తాన్, జిలానీ, సుభాని, అహ్మద్ హుస్సేన్, హుస్సేన్ బాష, సైదా, మౌళాలి, నుభాని కుటుంబం లు చేసారు. వారికి మంత్రి గొట్టి పాటి రవికుమార్ పార్టీ కండువా కల్పి సాధరంగా ఆహ్వానించారు. మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, మాసం రమేష్ బాబు, సొసైటీ చైర్మన్ వల్లభనేని నుబ్బయ్య, మోటుమర్రి ప్రసన్నకుమార్, బిలాలుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *