బేగంపేట సెప్టెంబర్ 24,
(జే ఎస్ డి ఎం న్యూస్) :కాయలు రాలుతున్నాయి.
గాయలవుతున్నాయ్ చేట్ల కొమ్మలు కొట్టివేయాలనీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా బి జే పి ప్రధాన కార్యదర్శి నెమలి ఆనంద్ డిమాండ్ చేశారు. బేగంపేట బ్రాహ్మణవాడి రైల్వే స్టేషన్ నుంచి మాతాజీ నగర్ వెళ్లే రోడ్ లో రోడ్డు పక్కన వున్న చెట్లకు కాసిన పెద్ద కాయలు (సుమారు కిలో నుంచి 5 కిలోల బరువు ఉన్న) చెట్ల పైనుంచి రాలి రోడ్డుపై వెళుతున్న పాద చారులు,వాహన దారులు,రైల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణీకులు తీవ్రంగా గాయపడుతున్నారని,వెంటనే రోడ్డు పక్కనే ఉన్న చెట్ల కొమ్మలను కొట్టి వేయాలని సికింద్రాబాద్ మహంకాళి జిల్లా బీ జే పి ప్రధాన కార్యదర్శి నెమలి ఆనంద్ డిమాండ్ చేశారు.బేగంపేట రైల్వే స్టేషన్ కు వచ్చే ఆటోలు,కార్లు,ద్విచక్ర వాహనదారులు చెట్లు కాయలు రాలి పడి తీవ్రంగా గాయపడ్డారని,వాహనాల అద్దాలు పగిలి పోతున్నాయని ఆరోపించారు. జీ హెచ్ ఎం సి అధికారులు స్పందించి వెంటనే చెట్లకు వున్న కాయలను ,కొమ్మలను కొట్టివేయాలని డిమాండ్ చేశారు.నిత్యం ఈ మార్గంలో వడ్డెర బస్తీ,బ్రాహ్మణవాడి,ఆర్ ఆర్ గోపాల్ కాంపౌండ్ ,మాతాజీ నగర్ లకు చెందిన ప్రజలు ప్రయాణిస్తుంటారు. ఈ ప్రాంతంలో పాఠశాలలు కూడా ఉండటంతో విద్యార్థులు గాయపడుతున్నారని
వారి తల్లి దండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి వెంటనే చెట్ల కొమ్మలు కొట్టి వేయాలని,కాయలు తొలగించాలని ఆనంద్ కోరారు.



