తాళ్లూరు: జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న బూచేపల్లి వెంకాయమ్మను వైఎస్సార్ సీపీ నాయకులు ఘనం గా సన్మానించారు. గురువారం చీమకుర్తిలో ఆమె నివాసంలో వెంకాయమ్మను శాలువాలు, పూలమాలలతో సత్కరించి పదవీ కాలం విజ యవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి బూచేపల్లి వెంకాయమ్మ అందించిన సేవలు గుర్తుండిపోయేలా ఉన్నాయని వక్తలు అన్నారు.. ప్రజలకు అందుబా
టులో ఉంటూ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేశారని కొనియాడారు. భవిష్యత్ లో
ఆమె మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని నాయకులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైఎ స్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూదన్ రెడ్డి ,మండల పార్టీ అధ్యక్షుడు తూము వెంకట సుబ్బారెడ్డి,
రైతు విభాగం మండల అధ్యక్షుడు గువ్వల వెంకట శ్రీనివాసరెడ్డి, యువజన విభాగం మండల అధ్యక్షుడు కొర్రపాటి విష్ణు, జిల్లా ప్రచార కార్యదర్శి గూడా గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.

