పండగ సీజన్‌ వేళ విద్యార్థులకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (Air India Express) గుడ్‌న్యూస్‌

పండగ సీజన్‌ వేళ విద్యార్థులకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (Air India Express) గుడ్‌న్యూస్‌ చెప్పింది. స్టూడెంట్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌ ప్రకటించింది. దేశ, అంతర్జాతీయ విమాన ఛార్జీలపై డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌ట్రా బ్యాగేజ్‌ వంటి సదుపాయాలు ఉన్నాయి. విద్యార్థులతో పాటు ఇతర కస్టమర్లకు కూడా మరో ఆఫర్‌ను ప్రకటించింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

స్టూడెంట్లకు ప్రత్యేక ఆఫర్‌

విమాన ప్రయాణాలు చేసే విద్యార్థులకు దేశ, అంతర్జాతీయ విమాన ఛార్జీలపై బేస్‌ ఫేర్‌పై 10 శాతం డిస్కౌంట్‌ అందిస్తుంది. అదనంగా మరో 10 కేజీల బ్యాగేజీని తీసుకెళ్లే సదుపాయం కల్పించింది. సాధారణంగా 15 కేజీల బ్యాగేజీకి మాత్రమే అనుమతిస్తారు. ఆఫర్‌లో భాగంగా 25 కేజీల బ్యాగేజీ వరకు వెంట తీసుకెళ్లొచ్చు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ యాప్‌ ద్వారా ప్రయాణ తేదీలను మార్చుకోవాల్సి వస్తే.. రూ.99కే తేదీలు మార్చుకోవచ్చు. అక్టోబర్‌ 20 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. కనీసం 12 ఏళ్ల వయసు ఉండాలి. గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి ఫొటోతో కూడిన ఐడీ ఉండాలి. అందులో విద్యార్థి పేరు, పుట్టిన తేదీ వివరాలు తప్పనిసరి.

ఇతర కస్టమర్లకు

విద్యార్థులతో పాటు కస్టమర్లకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఆఫర్లు ప్రకటించింది. తమ వెబ్‌సైట్‌ ద్వారా నేరుగా టికెట్‌ బుక్‌ చేసుకున్న ప్రయాణికులకు టికెట్లపై 5 శాతం డిస్కౌంట్‌ ఇస్తోంది. బుకింగ్‌ సమయంలో ప్రోమోలో కనిపించే VIBES కోడ్‌ ఉపయోగిస్తే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. వీసా డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డులను ఉపయోగించి టికెట్‌ బుక్‌ చేసుకున్నవారికీ డిస్కౌంట్‌ ఇస్తోంది. అధికారిక వెబ్‌సైట్‌లో కనిపించే ప్రోమో కోడ్ ఉపయోగించి ఛార్జీలపై రూ.600 వరకు ఆఫర్‌ పొందొచ్చు. ఈ ఆఫర్‌ కేవలం అక్టోబర్‌ 9 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *