తాడివారిపల్లి గ్రామానికి చెందిన తాడి మహాలక్ష్మమ్మ (30) సోమవారం పొలంలో గడ్డి కోస్తుండగా బోరు మోటార్ ప్యానల్‌కు సంబంధించిన విద్యుత్ వైరు తగిలి విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందింది.
మహాలక్ష్మమ్మ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
మృతురాలికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఘటనతో తాడివారిపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
