అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి -జంగాలపల్లి, అయ్యపురాజుపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ -రూ. 64 లక్షలతో అప్రోచ్ రోడ్డు నుండి అయ్యపురాజుపాలెం వరకు సిమెంట్ రోడ్డు పనులకు శంకుస్థాపన -మరో 13 రోడ్ల నిర్మాణానికి రూ. 24.20 లక్షలు కేటాయింపు

కొండేపి నియోజకవర్గం మర్రిపూడి మండల పరిధిలోని జంగాలపల్లి, అయ్యపురాజుపాలెం గ్రామాలలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు స్వయంగా పంపిణీ చేశారు. అనంతరం అయ్యపురాజుపాలెం గ్రామంలో రూ. 64 లక్షల అంచనా వ్యయంతో అప్రోచ్ రోడ్డు నుండి గ్రామం వరకు నిర్మించనున్న నూతన సిమెంట్ (సీసీ) రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ
ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ వివరాలను మంత్రి సుదీర్ఘంగా వివరించారు. సెప్టెంబర్ నెల నివేదిక ప్రకారం, జంగాలపల్లి గ్రామంలోని 35 మంది వృద్ధులకు రూ. 1,40,000, 10 మంది వితంతువులకు రూ. 40,000, 6 మంది వికలాంగులకు రూ. 48,000, ఇద్దరు డీఎంహెచ్‌ఓ లబ్ధిదారులకు రూ. 20,000 మరియు ఒక ఏకాకి మహిళకు రూ. 4,000 చొప్పున మొత్తం 56 మంది లబ్ధిదారులకు రూ. 2,52,000 పింఛన్ సొమ్మును అందజేశారు. అదేవిధంగా అయ్యపురాజుపాలెం గ్రామంలో 98 మంది వృద్ధులకు రూ. 3,92,000, 31 మంది వితంతువులకు రూ. 1,24,000, 18 మంది వికలాంగులకు రూ. 1,08,000, ఐదుగురు ఏకాకి మహిళలకు రూ. 20,000 మరియు నలుగురు డీఎంహెచ్‌ఓ లబ్ధిదారులకు రూ. 40,000 చొప్పున మొత్తం 156 మందికి రూ. 6,84,000 విడుదల చేశారు.
​మండల, నియోజకవర్గ మరియు జిల్లా స్థాయి గణాంకాలను పరిశీలిస్తే, మర్రిపూడి మండలం వ్యాప్తంగా ఉన్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, డప్పు కళాకారులు, చేనేత, కల్లు గీత కార్మికులు తదితర వర్గాలకు చెందిన మొత్తం 5,323 మంది లబ్ధిదారులకు రూ. 2,35,60,500 (రూ. 2.356 కోట్లు) పంపిణీ చేయడం జరిగింది.

కొండేపి నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 41,238 మంది పింఛనుదారులకు రూ. 18.032 కోట్ల నిధులను ప్రభుత్వం అందజేసింది. ఇక సమగ్ర ప్రకాశం జిల్లా వివరాలను చూస్తే, జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,16,273 మంది అర్హులైన పింఛనుదారుల కోసం రూ. 93.923 కోట్ల భారీ మొత్తాన్ని విడుదల చేసి, ప్రతి నెలా ఒకటో తేదీనే లబ్ధిదారుల ముంగిటకే పింఛన్ సొమ్మును చేరుస్తున్నట్లు వివరించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్నామని చెప్పారు. అయ్యపురాజుపాలెం గ్రామంలో తమ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే దాదాపు అన్ని రహదారులను నిర్మించామని, మిగిలి ఉన్న 13 రోడ్ల నిర్మాణ పనులను రూ. 24.20 లక్షల వ్యయంతో త్వరలోనే పూర్తి చేయనున్నట్లు హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో వీరరెడ్డిపాలెం గ్రామం నుండి అత్యవసర సమయంలో ఆంబులెన్స్ వెళ్లడానికి కూడా వీలులేని విధంగా రోడ్లు ధ్వంసమయ్యాయని, ఆ సమస్యను పరిష్కరిస్తూ రూ. 1.50 కోట్ల నిధులతో నూతన రహదారిని నిర్మించినట్లు గుర్తుచేశారు. మన కొండేపి హార్టికల్చర్ హబ్ పరిధిలోకి ఈ గ్రామం కూడా వస్తుందని, తద్వారా స్థానిక రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. అలాగే వెలుగొండ ప్రాజెక్టు ద్వారా పాలేరు ప్రాజెక్టుకు నీటిని తరలించి ప్రాంతీయంగా తాగు, సాగునీటి కష్టాలను శాశ్వతంగా తీరుస్తామని, త్వరలోనే సంగమేశ్వరం ప్రాజెక్టు పనులను కూడా ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

​సభలో గ్రామంలోని రోడ్ల పక్కన జరిగిన ఆక్రమణల గురించి ప్రజలు మంత్రి దృష్టికి తీసుకురాగా, ఆయన వెంటనే స్పందించారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న ఆక్రమణలపై రెవెన్యూ మరియు పోలీసు అధికారులు తక్షణమే క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గత ప్రభుత్వ హయాంలో అమాయకులపై తప్పుడు కేసులు పెట్టి తీవ్రంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలో ఎవరిపైనా కావాలని తప్పుడు కేసులు పెట్టే ప్రసక్తే లేదని, అయితే ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తూ తప్పులు చేసే వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
​
​చివరగా, రాష్ట్రంలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాల ప్రాముఖ్యతను మంత్రి వివరించారు. రైతులకు పెట్టుబడి సాయంగా ఇచ్చే ‘అన్నదాత సుఖీభవ’, పిల్లల చదువుల నిమిత్తం తల్లులకు అందించే ‘తల్లికి వందనం’, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి ఉద్దేశించిన ‘దీపం’ పథకంతో పాటు పాడి రైతులకు లబ్ధి చేకూర్చే పాలు పథకం గురించి వివరంగా తెలపడంతో పాటు, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే తమ లక్ష్యమని డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆయన వెంట సాంఘీక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మానాయక్,ఎస్.సి కార్పొరేషన్ ఈ.డి అర్జున్ నాయక్, తహసిల్దార్ జనార్దన్,ఎంపిడిఓ ఎస్.కె.నాగూర్ వలీ,నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్,మండల అధికారులు ,ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *