తాళ్లూరు: జాతి పిత మహాత్మాగాంధీజి జయంతి వేడుకలు శుక్రవారం అన్ని పంచాయితీలలో ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ అజిత తూర్పుగంగవరం పంచాయితీలో, బొద్దికూరపాడులో డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాస రావు, మాధవరం, మల్కాపురంలలో ఎంఈఓ సుబ్బయ్య లు పాల్గొని బాపూజీకి ఘన నివాళులు అర్పించారు. గ్రామ సభ నిర్వహించి ప్రభుత్వ ప్రాముఖ్యతను వివరించారు. ఎంపీడీఓ కార్యాలయంలో బాపూజీ చిత్రపటానికి ఇన్చార్జి ఎంపీడీఓ శ్రీనివాస రావు, ఎపీఎం దేవరాజ్, ఎపీఓ వెంకట రావు, కార్యాలయ సిబ్బంది పాల్గొని పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయా పంచాయితీలో గ్రామ కార్యదర్శిలు మహాత్ముని చిత్ర పటానికి నివాళులు అర్పించి, ఆయన కలలు కన్న గ్రామ స్వరాజ్యస్థాపనకు, స్వచ్చతకు ప్రతి ఒక్కరూ సహరించాలని ప్రభుత్వ ప్రాముఖ్యతలను వివరించారు.







Save or share this story as a newspaper-style Epaper Clip: