సికింద్రాబాద్ అక్టోబర్ 2(జే ఎస్ డి ఎమ్ న్యూస్ )
సికింద్రాబాద్ నియోజకవర్గంలోని లాలాగూడ శాంతినగర్ లో తెలుగుదేశం పార్టీ అడ్డగుట్ట డివిజన్ అధ్యక్షుడు కాతా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద బాపూజీకి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సికింద్రాబాద్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వల్లారపు శ్రీనివాస్ కుమార్ హాజరై గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా అనేది ఆయన పేరు గా స్థిరపడింది. భారత దేశానికిస్వాతంత్య్రాన్ని సాధించి దాని ఫలాలను ప్రజలకు అందించాలని సత్యం, అహింస అనే రెండు మార్గాలను మహాత్మాగాంధీ ఎంచుకున్నారని అన్నారు. బ్రిటీషు వారి వద్ద అధికారం, ఆయుధాలు ఉండి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈ రెండు మార్గాలను గాంధీ విడిచిపెట్టలేదన్నారు.సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం వంటి అనేక కార్యక్రమాలను ఈ రెండు మార్గాల ద్వారానే చేసి స్వాతంత్య్రాన్ని సాధించారు. తన జీవితమంతా దేశంకోసం అర్పించిన మహావ్యక్తి అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పరిటాల విజయ్ కుమార్, జి ఎం రమేష్, రాజు నాయక్, ఎర్ర నాగార్జున, బొల్లు సురేష్, నవీన్, లక్సయ్య, అంబాల రమేష్, వెంకటస్వామి, పుప్పాల విజయకుమార్, జగదీష్ గౌడ్, శేషిరెఖ, చందర్ ముదిరాజ్, మురళి, రామారావు, ప్రసాదరావు, విక్రమ్, టైలర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: