జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం అధ్యక్షుడుశాంసన్‌కు ఘన సన్మానం….. జనసేన నేత బోయేసు ఆధ్వర్యంలో నిర్వహణ -రాజానగరం వాసుల , మిత్రుల అభినందనలు

తాళ్లూరు:
జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా అనపర్తి శాంసన్ ఎన్నికైన సందర్భంగా తాళ్లూరు మండలం మల్కాపురం పంచాయతీ పరిధిలోని రాజానగరం గ్రామంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. జనసేన నాయకుడు అనపర్తి బోయేసు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శాంసన్‌ను శాలువాలతో సత్కరించి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించి, అభినందించారు.
ఈ సందర్భంగా జనసేన నాయకుడు బోయేసు మాట్లాడుతూ ..జిల్లా స్థాయి బాధ్యతలు చేపట్టిన శాంసన్ ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యల పరిష్కారం, వారి సంక్షేమం కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు. గ్రామానికి చెందిన వ్యక్తికి జిల్లా స్థాయి బాధ్యత దక్కడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి శాంసన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు షేక్ ఖాసిం సైదావలి, మండారి హరిబాబు, హైస్కూల్ చైర్మన్ పులి సుబ్బారావు, అనపర్తి నాగేశ్వరరావు, అనపర్తి చిన్నదాసు, వంగపల్లి శ్రీను, అనపర్తి పెద్దదాసు, ఎస్‌కే దరియా తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *