తాళ్లూరు: ప్రధాని నరేంద్రమోదీజీ సుదీర్ఘ ప్రజా పేవను స్పురించుకుంటూ సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు దర్శి టిడిపి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. తూర్పుగంగవరం పీహెచ్సీ లో మంగళవారం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మౌనిక, డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో సేవా సంకల్స్లో బాగంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసారు. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీజీ పాతికేళ్లుగా నిరంతరం ప్రజా సేవకే తన జీవితాన్ని అంకితం చేసారని ఆయన నాయకత్వంలో దేశం సంక్షేమం, అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అన్నారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ప్లానింగ్, డిప్యూటీ సీఎం పవన్, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో అభివృద్ధి ముందజలో ఉందని చెప్పారు. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ నిర్వహించటం ప్రజలకు ఎంతో ఉ పయోగకరమని అన్నారు. తూర్పుగంగవరం పంచాయితీ పరిధిలో ప్రజా నమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందేలా తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. టిడిపి పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, మానం రమేష్ బాబు, బడే , బొమ్మిరెడ్డి ఓబులు రెడ్డి, క్టస్టర్ ఇన్చార్జి రాచకొండ వెంకట రావు, మస్తాన్, పిన్నిక రమేష్ తదితరులు పాల్గొన్నారు.



Save or share this story as a newspaper-style Epaper Clip: