ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు చేయటంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలి – రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు చేయటంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. ఈనెల 9వ తేదీన ముఖ్యమంత్రి జరుగుమల్లి మండలంలోని నర్సింగోలు గ్రామానికి రానున్న నేపథ్యంలో వీటికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పి.రాజా బాబు, రాష్ట్ర మ్యారీటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణలతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. హెలిప్యాడ్, ప్రజా వేదిక, అనంతరం పార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి నిర్వహించే సమావేశానికి సంబంధించిన సభా స్థలాలలో పట్టాల్సిన పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, మరుగుదొడ్లు, విఐపిలకు ఆహ్వానాలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి చెప్పారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లపై వివిధ శాఖలకు ప్రత్యేక బాధ్యతలు కేటాయించామన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు పూర్తిచేసేలా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. దీనికోసం ఆర్డిఓ ను సమన్వయ అధికారిగా నియమించామన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు, జడ్పీ సీఈవో చిరంజీవి, డిపిఓ అనుపమ, స్వర్ణ గ్రామ, స్వర్ణ అవార్డు సచివాలయాల అధికారి వెంకటేశ్వరరావు, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ రవికుమార్, వివిధ శాఖల జిల్లా, స్థానిక అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *