నేడు కాంగ్రెస్ ‘చలో లోక్‌భవన్‌’..–-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరు-–పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలిరావాలి… దీపక్ జాన్ విజ్ఞప్తి

సికింద్రాబాద్ అక్టోబర్ 7,(జే ఎస్ డి ఎమ్ న్యూస్ ) :
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌జ్ఞానేష్‌కుమార్‌రాజీనామా చేయాలని డిమాండ్‌చేస్తూ ‘ఇండియా’ కూటమి ఆధ్వర్యంలో గురువారం (అక్టోబర్ 8) రాజధానిలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఉదయం 10 గంటలకు ‘చలో లోక్‌భవన్‌’ పేరిట ఈ ఆందోళన కార్యక్రమం జరగనుంది.
ఈ నిరసన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బి. మహేష్‌కుమార్‌గౌడ్‌, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్‌కార్యదర్శి సచిన్‌సావంత్‌తో పాటు ‘ఇండియా’ కూటమికి చెందిన కీలక నేతలు పెద్ద ఎత్తున పాల్గొంటారని సికింద్రాబాద్‌డీసీసీ అధ్యక్షుడు దీపక్‌జాన్‌వెల్లడించారు.
రాష్ట్ర రాజధానితో పాటు సికింద్రాబాద్‌పరిధిలోని డివిజన్‌అధ్యక్షులు, డీసీసీ కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంఘాల చైర్మన్లు, పదాధికారులు, సీనియర్‌నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి నిరసనను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేపట్టే ఈ పోరులో కాంగ్రెస్ శ్రేణులంతా సమన్వయంతో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *