బేగంపేట అక్టోబర్8,(జే ఎస్ డి ఎమ్ న్యూస్ ) :
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద గురువారం గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా తో భేటీ అయ్యారు.ఉదయం 11 గంటలకు గవర్నర్ తోమర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు .
వారిరువురు సుమారు 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగామహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఇప్పటివరకు సాధించిన ప్రగతి, తీసుకున్న నిర్ణయాలు, కమిషన్ ను రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలాలకు తీసుకెళ్లిన తీరు, తీసుకొచ్చిన మార్పులపై గవర్నర్ కి చైర్ పర్సన్ వివరించారు.రెండవసారి మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు అనే అంశాలపై గవర్నర్ కి తెలియజేసారు.
కమిషన్ సేవలు మారు మూల ప్రాంతాలవరకు తీసుకెళ్లాలని చైర్ పర్సన్ నేరెళ్ళ శారద కి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూచించారు.




Save or share this story as a newspaper-style Epaper Clip: