ఎస్సార్ నగర్ అక్టోబర్ 8,(జే ఎస్ డి ఎమ్ న్యూస్ ) :
ఎస్సార్ నగర్లో యువతి శిరీష హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఓయో హోటల్లో ప్రియుడు శ్రీనివాస్ ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకోవాలని శిరీష కోరడంతో ఇద్దరి మధ్య వివాదం జరిగిందని, ఈ క్రమంలో హోటల్ కర్టెన్ పైపుతో ఆమెపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసిన శ్రీనివాస్ శిరీష వద్ద ఉన్న రూ.4 లక్షలు తీసుకుని పరారైనట్లు వెల్లడించారు. నిందితుడిని ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: