సనత్ నగర్ అక్టోబర్ 10,(జే ఎస్ డి ఎమ్ న్యూస్ ) :
శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఆహ్వానం అందించారు.ఈ నెల 11 నుండి 20 వ తేదీ వరకు నిర్వహించే శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు రావాలంటూ మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఆహ్వానాలు అందజేశారు. శనివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయంలో సనత్ నగర్ లోని హనుమాన్ దేవాలయం అధికారులు, పండితులు ఆహ్వానాన్ని ఎమ్మెల్యే కు అందజేశారు. అదేవిధంగా విజయ దశమి రోజున సాయంత్రం నిర్వహించే రావణ దహనం కార్యక్రమానికి కూడా హాజరుకావాలని కోరారు. ఎమ్మెల్యే ను కలిసిన వారిలో సనత్ నగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, ఆలయ ఈ ఓ సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ గౌడ్, అర్చక పండితులు పరాశరం రవీంద్రాచార్యులు, నాయకులు కరుణాకర్ రెడ్డి, రవి కుమార్, మహేష్ తదితరులు ఉన్నారు. అదేవిధంగా పద్మారావు నగర్ లోని పోల్ బాల్ హనుమాన్ దేవాలయం అధికారులు, పండితులు దేవీ నవరాత్రులకు రావాలంటూ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఆహ్వానాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈ ఓ నర్సదాస్, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుడు రాజేష్ గౌడ్, ఆలయ పండితులు వినోద్, ప్రసాద్ తదితరులు ఉన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: