తాళ్లూరు: ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని దర్శి టిడిపి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. మండలంలో రూ.1.90 కోట్లతో మంజూరు అయిన తాళ్లూరు – మల్కాపురం, లింగాల పాడు- మన్నేపల్లి రోడ్లకు ఆదివారం రాత్రి భూమి పూజ నిర్వహించారు. రవాణా ఇబ్బందులు తొలగిపోయి ప్రజలకు ప్రయాణం మరింత సులభతరం అవుతుందని అన్నారు. కార్యక్రమంలో నియోజక వర్గ పరిశీలకులు గంజాం రాఘవేంద్ర, ఎఎంసీ చైర్మన్ డీఎన్ సుబ్బా రావు పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, మాజీ వైన్ ఎంపీపీ ఐ వెంకటేశ్వర రెడ్డి, నాటక అకాడమి రాష్ట్ర డైరెక్టర్ ఓబులు రెడ్డి, మానం రమేష్ బాబు, ఎఎంసీ డైకెక్టర్ సైదా వలి, వెంకట రెడ్డి, రామకోటి రెడ్డి, నాగార్జున రెడ్డి, పిన్నక రమేష్, హనుమంత రావు, శ్రీకాంత్ రెడ్డి, శ్యామ్సన్,నుజాత నాదేళ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.



Save or share this story as a newspaper-style Epaper Clip: