రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత –ట్రాఫిక్ ఏసిపి జీ.శంకర్ రాజు

సికింద్రాబాద్ అక్టోబర్ 12 జెఎస్ డి ఎం న్యూస్ ) :
రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగాపాటించడం ద్వారాప్రాణాలను కాపాడుకోవచ్చని తిరుమలగిరి ట్రాఫిక్ ఏసీపీ జి. శంకర్ రాజు స్పష్టం చేశారు. మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఆదేశాల మేరకు, ట్రాఫిక్ డీసీపీ-1 కె. రాహుల్ రెడ్డి పర్యవేక్షణలో బోయిన్‌పల్లిలోని జాతీయ మేధో వైకల్యం గల వ్యక్తుల సాధికారత సంస్థ (NIEPID)లో సోమవారం ట్రాఫిక్ అవగాహన సదస్సు నిర్వహించారు. తిరుమలగిరి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఐ.వి. రమణయ్య, ఎస్సై వి. దామోదర్‌లతో కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది విద్యార్థులు, సంస్థ అధ్యాపకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏసీపీ శంకర్ రాజు మాట్లాడుతూ సురక్షితంగా రోడ్డు దాటే పద్ధతులు, పాదచారుల భద్రత, ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రాముఖ్యతపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు తాము నిబంధనలు పాటించడమే కాకుండా, తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల్లోనూ మార్పు తీసుకురావడానికి కృషి చేయాలన్నారు. ట్రాఫిక్ క్రమశిక్షణను అలవాటు చేసుకుని ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పోలీసు అధికారులు అందించిన విలువైన మార్గదర్శకాలను సంస్థ ప్రతినిధులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఐఈపీఐడీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ శ్రవణ్ రెడ్డి, విభాగాధిపతి డాక్టర్ యతేంద్ర కుమార్, అధ్యాపకులు డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ అంబాడి, హిమాంశు వర్మ, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *