బేగంపేట లో పీ అండ్ టీ ఫ్లై ఓవర్ ను ఢీ కొన్న ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు.మంటలు పొగలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సు నిలిపివేత ప్రయాణికులు క్షేమం.

బేగంపేట అక్టోబర్ 12 (జె ఎస్ డి ఎం న్యూస్)
బేగంపేట లో పీ అండ్ టీ ఫ్లై ఓవర్ ను ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు ఢీకొంది. ఈ ఘటనతో
బస్సు టాపు భాగం ఫ్లైఓవర్ పిల్లర్ కు బలంగా తగిలి మంటలు పొగలు దట్టంగా వచ్చాయి.మంటలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సు నిలిపి వేశారు. ప్రయాణికులు క్షేమంగా వున్నారు. బస్సు ఆ ప్రాంతానికి చేరుకున్న సమయంలో కారును తప్పించే క్రమంలో బస్సు ఫ్లైఓవర్ పిల్లర్ ను ఢీకొంది. సికింద్రాబాద్ నుండి కొండాపూర్ కు వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు ప్రమాదవశాత్తు ఫ్లైఓవర్ దిగువ (అంచు) భాగాన్ని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎలక్ట్రికల్ బస్సు రూఫ్ ఫ్లైఓవర్ ను బలంగా ఢీ కొట్టిన కారణంగా బస్సులో నుండి ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. ప్రయాణికుల సమాచారంతో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో పొగలను మంటలు అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీంతో ప్రజాభవన్ వైపుకు వెళ్లే రహదారి పై వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.విషయం తెలుసుకున్న బేగంపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కావేటి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎస్సై అశోక్ రెడ్డీ సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *