సికింద్రాబాద్, అక్టోబర్ 12 (జే ఎస్ డి ఎం న్యూస్ ) :
బోలక్పూర్లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి.రంగురంగుల పూల బతుకమ్మలు, విద్యార్థినుల కోలాటాలు, పాటలతో పాఠశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన బీఆర్ఎస్ అధికార ప్రతినిధి వరప్రసాద్, రిటైర్డ్ ఎస్పీ ఏపీ యాదగిరి, నాయకుడు అశోక్ ఉత్తమ బతుకమ్మలను రూపొందించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. తెలంగాణ సంస్కృతిని కాపాడటంలో ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అతిథులు పేర్కొన్నారు. పాఠశాల డైరెక్టర్ డాక్టర్ మంచాల శ్రీనివాసులు, ప్రిన్సిపల్ డాక్టర్ వరలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: