పాడిరైతులకు ప్రభుత్వం 50శాతం రాయితీపై చాప్ కట్టర్లను అందజేస్తుందని తాళ్లూరు పశువైద్యాధికారి డాక్టర్ వెన్నా ప్రతాపరెడ్డి తెలిపారు. తాళ్లూరు పశు వైద్యశాల వద్ద తాళ్లూరు, మాధవరం, విఠలాపురం, దారం వారిపాలెం గ్రామాలకు చెందిన రైతులకు ఏడు చాప్ కట్టర్లను సోమవారం అంద చేశారు. వీటిద్వారా గడ్డిని కత్తిరించవచ్చని, మేత వృథా కాకుండా ఉంటుందని, పశువులకు సమపాళ్లలో పోషకాలు అందుతాయన్నారు. సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: