ఒంగోలు: ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్. మా ణిక్యరావు, అడ్మినిస్ట్రేటర్ వెంకటరమణ కలిసి నర్సింగ్ కళాశాల పరిసర ప్రాంతాలు, ఆసుపత్రిలోని వివిధ వార్డులను సందర్శించి తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా క్రిటికల్ కేర్ బ్లాక్ (CCB) నిర్వహణ, కార్యకలాపాల ప్రారంభానికి సంబంధించిన సమస్యలను సమీక్షించి, అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. మూడో అంతస్తులోని స్లాబ్ మరమ్మతులు, పునరుద్ధరణ పనులను తక్షణమే చేపట్టాలని ఏపీఎంఎస్ఐడీసీ (APMSIDC) అధికారులకు ఆదేశించారు.
అలాగే ఆసుపత్రిలోని క్యాథ్‌ల్యాబ్ (Cath Lab) సౌకర్యాలను పరిశీలించి, గుండె సంబంధిత అత్యవసర చికిత్సలు అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, పరికరాల పనితీరును సమీక్షించారు. స్టెంటింగ్ చికిత్సలు అవసరమైన రోగులకు ఎలాంటి జాప్యం లేకుండా వైద్య సేవలు అందేలా అవసరమైన ఏర్పాట్లు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
అనంతరం వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, వారికి అందుతున్న వైద్య సేవలు, మందులు, ఇతర సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న అధికారులు, వైద్యులు మరియు సిబ్బంది సమయపాలన పాటిస్తూ, రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆసుపత్రి మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విజిటింగ్ లో Csrmo డా . మాధవి లత, ARMO లు సునీల్ గవాస్కర్, డా . లక్ష్మ నాయక్, తేజ ఏఈ వెంకటరావు ఉన్నారు .




Save or share this story as a newspaper-style Epaper Clip: