శ్రీ కట్ట మైసమ్మ మహాలక్ష్మి ఆలయంలో శ్రీ సరస్వతి దేవి అలంకారం..

బేగంపేట అక్టోబర్ 17 జె ఎస్ డి ఎం న్యూస్)
బేగంపేట శ్రీ కట్ట మైసమ్మ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం శ్రీ సరస్వతి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయ ఈ ఓ, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ చెక్కలు సుభాష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాలలో విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేసిన అమ్మవారి భారీ కటౌట్లు భక్తులను ఎంతగానో అలరించాయి. భక్తులు పూజలు నిర్వహించిన అనంతరం తీర్థప్రసాదాలను అందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *