బేగంపేట అక్టోబర్ 18,(జే ఎస్ డీ ఎమ్ న్యూస్ ) :
దసరా శరన్నవ రాత్రులను పురస్కరించుకుని
ఆదివారం మాజీ ఉపాధ్యక్షులు , బిజెపి నాయకులు మర్రి శశిధర్ రెడ్డి పద్మారావు నగర్ డివిజన్ మరియు బన్సీలాల్ పేట్ డివిజన్లలోని దుర్గామాత మండపాలను సందర్శించి, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ముందుగా పద్మారావు నగర్ పోల్ బాల్ హనుమాన్ దేవాలయంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని , అనంతరం న్యూ బోలక్ పూర్ పెంటయ్య బస్తీలోని మండపాన్ని , తదుపరి కృష్ణా నగర్ కాలనీ ఎవర్ గ్రీన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపాన్ని , బన్సీలాల్ పేట్ నీలం బాలయ్య దొడ్డిలోని మండపాన్ని , చివరగా జీరా కాంపౌండ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో శ్రీ శశిధర్ రెడ్డి గారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమాల్లో మహంకాళి సికింద్రాబాద్ జిల్లా కౌన్సిల్ సభ్యులు గుంటిసత్యనారాయణ , జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్. చంద్రపాల్ రెడ్డి , బీజేపీ సీనియర్ నాయకులు ఎం. రఘునాథ్ గౌడ్ , పిట్ల శ్రీనివాస్ , బీజేపీ బన్సీలాల్ పేట్ డివిజన్ కార్యదర్శి పార్శి పరమేశ్ , దొడ్డె సురేష్ , బొజ్జ నర్సింగ్ రావు, గంగిరెడ్డి అభినవ్ , ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.




Save or share this story as a newspaper-style Epaper Clip: